మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్ టాక్



Middle Class Melodies trailer talk
2020-11-10 16:22:56

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకండ హీరోగా వస్తోన్న సినిమా " మిడిల్ క్లాస్ మెలోడీస్". ఈ సినిమాను వినోద్ ఆనంతోజు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలో ఆనంద్ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు స్టోర్టీ, డైలాగ్స్ ను జనార్దన్ పసుమర్ధి అందించారు. అంతే కాకుండా స్వీకర్  అగస్తీ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా చిత్ర యూనిట్ మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ విషయానికొస్తే పేరుకు తగినట్టుగానే మిడిల్ క్లాస్ యువకుడి జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. సినిమాలో ఆనంద్  రాఘవ అనే ఒక యువకుడిగా కనిపించనున్నాడు. 

ఊర్లో తండ్రి హోటల్ లో పనిచేస్తూ జీవనం గడిపే రాఘవ గుంటూరు టౌన్ లో హోటల్ పప్రారంభించి సక్సెస్ అవ్వాలని కలలు కంటాడు. ఈ క్రమంలో అతడు ఎదురుకునే ఆటు పోట్లు ఎలా ఉండబోతున్నాయని సినిమాలో చూపించనున్నారు. అంతే కాకుండా రాఘవ తండ్రి మరియు అతడి మధ్య జరిగే సంభాషణ సినిమాలో కామెడీ పుట్టిస్తుందని అర్థం అవుతుంది. సినిమాలో గుంటూరు టౌన్ ను హైలెట్ చేస్తూ చూపించనట్టుగా కనిపిస్తోంది. సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుందని అర్థమవుతుంది. మొత్తంగా సినిమాలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తుల కలలు..ఆ కలలను సాధించే క్రమంలో ఎదుర్కొనే ఇబ్బందులు ఎలా ఉంటాయో చూపించనున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ కూడా నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈ నెల 20న ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

More Related Stories