పవన్ కల్యాణ్‌పై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు..Pawan Kalyan Politician.jpg
2019-12-02 21:59:57

పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. అసలు ఈయన్ని చూస్తుంటే తెలివి ఉండి మాట్లాడుతున్నాడో.. లేక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు కూడా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జనసేనానిపై ఓ రేంజ్ లో మండిపడ్డాడు. 

పవన్ కల్యాణ్ ను ఏమని పిలవాలో తనకు తెలియడం లేదని చెప్పాడు ఈ మంత్రి. కనీసం ప్రతిపక్ష నేత అందామంటే ఒక్క చోట గెలవలేదు.. అదీ కాక హీరో అందామంటే సినిమాలు కూడా లేవు.. అవన్నీ కాదు మేధావి అందామా అతని కంటే పెద్ద అజ్ఞాని ఎవరూ ఉండరు అంటూ పవన్ పై మండిపడ్డాడు మంత్రి.

చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి హచ్ కుక్క లాగా ఫాలో అవుతాడు పవన్ నాయుడు.. కనీసం  మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు.. ఎవడి దమ్ము ధైర్యం ఎంతుందో ప్రజలకు తెలుసు.. ఈయన వచ్చి ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదంటూ రెచ్చిపోయాడు. నువ్వు పిలవకపోతే జగన్ ముఖ్యమంత్రి కాడా అంటూ ప్రశ్నించాడు.

ఏం మాట్లాడుతున్నాడో కూడా కనీసం తెలియని పరిస్థితుల్లోకి పవన్ వెళ్ళిపోయాడని విమర్శించాడు అనిల్ కుమార్. కులాలు, మతాల ప్రస్తావిస్తూ నీచమైన ఆరోపణలు చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యాడు.

తన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ పేదలకు మాత్రం తెలుగు కావాలని డిమాండ్ చేస్తావా అంటూ ప్రశ్నించాడు అనిల్. యువతను సన్మార్గంలో పెడతానంటున్న పవన్ తన ఫాన్స్ ను ముందు మంచి మార్గంలో పెట్టమను అంటూ మండిపడ్డాడు. ఎవరి తాట తీస్తావు.. ఎవరి తోలు తీస్తావు.. దమ్ము, ధైర్యం ఉంటే ముందు గెలిచి చూపించు. సంస్కృతి గురించి నువ్వు మాకు చెప్పాలా.. పంచె కట్టు అనేది రాయలసీమ సంస్కృతి అక్కడ నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదంటూ రెచ్చిపోయాడు.

డిసెంబర్ 26వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తున్న విషయం పేపర్లు చూస్తే తెలుస్తుంది.. ఐదేళ్లుగా నిన్ను ప్రజలు చూస్తున్నారు.. ఎంతమంది తాట, తోలు తీసావో అందరికీ తెలుసు అంటూ విమర్శించాడు ఈ మంత్రి.

More Related Stories