హీరో శర్వానంద్ ను కలిసిన మంత్రి అవంతి శ్రీనివాస్ minister avanthi srinivas
2021-03-30 14:40:58

సింహాచలం లో ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న మహాసముద్రం సినిమా షూటింగ్ జరుగుతోంది. సింహగిరిపై సోమవారం హీరో శర్వానంద్ హీరోయిన్ అదితి రావు హైదరి మధ్య కీలక సన్నివేశాలను చిత్రించారు. ఆలయంలో అన్న ప్రాసన చేస్తున్న ఓ సన్నివేశం తో పాటు ఓ స్వామీజీ ప్రవచనాలు చెప్పే సీన్ ను తీశారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శర్వానంద్ ,మంత్రి అవంతి శ్రీనివాస్ ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. 

కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇక విశాఖలో ముప్పై రోజులపాటు మహాసముద్రం సినిమా షూటింగ్ జరిపామని సినిమా నిర్మాత అనిల్ సుంకర అన్నారు. ఇక శర్వానంద్ వచ్చిన సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శర్వానంద్ మరియు చిత్ర యూనిట్ సభ్యులకు అతిధి మర్యాదలు చేశారు. అంతే కాకుండా చిత్ర దర్శకుడు అజయ్ భూపతి స్వామివారికి కిలో ముత్యాలను కానుకగా ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సిద్ధార్థ్ కూడా మరో హీరోగా నటిస్తున్నారు. ఆర్ఎక్స్100 సినిమా లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.

More Related Stories