స్టార్ హీరో ఇంట విషాదం...బెంగళూరులో చిక్కుకున్న హీరో Mithun Chakraborty
2020-04-23 17:22:33

బాలీవుడ్ సీనియర్ నటుడు, ఒకప్పటి స్టార్ హీరో మిథున్‌ చక్రవర్తి తండ్రి బసంత్‌కుమార్ చక్రవర్తి నిన్న కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 95 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం ముంబైలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు మీడియాకి తెలిపారు. అయితే ఇక్కడ బాధ కలిగించే విషయం ఏమంటే లాక్‌డౌన్ కారణంగా బెంగళూరులో మిథున్‌ చిక్కుకుపోయారు. బసంత్ కుమార్ మృతికి బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా ఎక్కైకక్కడ స్తంభించిపోయింది. దీంతో ఆయన కర్ణాటక దాటి రాలేని పరిస్థితి. రైళ్లు, విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, ప్రైవేట్ వాహనాలను రాష్ట్ర సరిహద్దులు దాటనీయక పోవడం కారణంగా మిథున్ చక్రవర్తి అక్కడే చిక్కుకుపోయారు. కనీసం తండ్రిని ఆఖరిచూపు కూడా చూడలేని పరిస్థితి నెలకొంది. ఇక ఆయన ముంబై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

More Related Stories