లాక్ డౌన్ సమయంలో మోహన్ బాబు సంచలన నిర్ణయం.. Mohan babu
2020-04-08 23:31:51

లాక్ డౌన్ కారణంగా దేశంలో చాలా మంది ప్రజలు వైరస్ కంటే ముందు ఆకలితో చచ్చిపోతున్నారు. చేసుకోడానికి పని లేక.. చేతుల్లో డబ్బుల్లేక ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వాళ్లకు ప్రభుత్వమే అండగా నిలుస్తుందని చెబుతున్నా కూడా అందరికీ అది సాధ్యం కావడం లేదు. ఈ లాక్ డౌన్ తమ ప్రాణాలు తీయడానికే వచ్చిందంటూ కొందరు ఏడుస్తున్నారు.. వాళ్లను చూస్తుంటే కన్నీళ్లు కూడా ఆగట్లేదు. అందుకే కొందరు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ నటుడు మోహన్ బాబు, తన పెద్ద కుమారుడు అయిన మంచు విష్ణుతో కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని నాంది పలికాడు. మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరూ కలిసి చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకున్నారు. అయితే వారికి రోజుకు రెండు సార్లు ఆహారం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కరోనా కోసం చాలా మంది విరాళం అందించారు.

అయితే ఇప్పటి వరకు ఈయన ఆర్థిక సాయం అయితే చేయలేదు కానీ ఇప్పుడు మోహన్ బాబు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా గొప్పది అంటున్నారంతా. డబ్బుల కంటే కూడా 8 గ్రామాలకు ఈ లాక్ డౌన్ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు రెండు పూటలా అన్నం పెడతానంటున్నాడు ఈయన. కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడిపుడే వదిలేలా కనిపించడం లేదు. లాక్ డౌన్ సైతం ఇంకా పొడిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో వాళ్లను ఆదుకునేందుకు మోహన్ బాబు కుటుంబం ముందుకొచ్చింది. ఇప్పటికే కొన్ని రోజులుగా ఆ గ్రామాల్లో ఆహారం అందిస్తున్నారు వీళ్లు. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ సేవలను కొనసాగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరు ప్రతి రోజు 8 టన్నుల కూరగాయలను సరఫరా చేస్తున్నారు కూడా. వీళ్లు చేస్తున్న సాయం గురించి తెలుసుకుని టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

More Related Stories