సైరా సినిమాపై ఆసక్తికరమైన ట్వీట్ చేసిన మోహన్ బాబు..Mohan babu
2019-10-01 18:18:04

ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్ బాబు రిలేషన్ గురించి ఎవర్ని అడిగినా చెప్తారు. టామ్ అండ్ జెర్రీకి తక్కువ కాని ఇమేజ్ వాళ్ల సొంతం. ఎప్పుడు ఎవర్ని ఎలా టార్గెట్ చేస్తారో తెలియదు. ఒక్కోసారి ప్రేమతో చంపేస్తారు.. మరోసారి కోపంతో మండిపడతారు. ఇప్పుడు మోహన్ బాబు ప్రేమతో పడేస్తున్నాడు. సైరా సినిమా విడుదల సందర్భంగా తన మిత్రుడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు కలెక్షన్ కింగ్. తెలుగు సినిమా స్థాయిని పెంచాలని కోరుకున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది సైరా నరసింహా రెడ్డి. మోహన్ బాబు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను.. ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీటేసాడు కలెక్షన్ కింగ్. మంచు వారసులు కూడా సైరాపై ట్వీట్ చేసారు. మంచు లక్ష్మి, మంచు మనోజ్ సైరా సినిమాపై ట్వీట్ చేసారు.

More Related Stories