మెగాస్టార్ ఆచార్య సెట్స్ లో మోహన్ బాబు సందడిMohan Babu chiru
2020-12-24 01:01:13

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సినప్పటికి కరోనా లాక్ డౌన్ తో ఆలస్యం అయింది. లాక్ డౌన్ తరవాత షూటింగ్ తిరిగి ప్రారంభించినప్పటికి టెస్ట్ కిట్ లో లోపం వల్ల చిరుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో కొన్నిరోజులు చిరు అవసరం లేని సన్నివేశాలను చిత్రించారు. ఇక ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. అయితే తాజాగా నటుడు మోహన్ బాబు ఆచార్య సినిమా షూటింగ్ సెట్ కు వెళ్లి సందడి చేశారు. 

ముందుగా సమాచారం ఇవ్వకుండా మోహన్ బాబు ఆచార్య సెట్స్ కు వెళ్లి మెగాస్టార్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కు ఆయన పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. ఇక మెగాస్టార్ మరియు మోహన్ బాబు లు ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రరత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ కుడా హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ నేపథ్యంలో సన్ ఆఫ్ ఇండియా ఆశ్చర్యను కలుసుకోవడానికి వెళ్లినట్టు తెలుస్తోంది.

More Related Stories