మెగాస్టార్ లూసిఫర్ నుండి బిగ్ అప్డేట్



Chirajeevi Mohan raja
2020-11-26 15:38:06

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను రాంచరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరవాత మెగాస్టార్ కోసం మరో రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన వేదాలం, లూసిఫర్ రీమేక్ లో నటించడానికి చిరు రెడీగా ఉన్నారు. అయితే చిరు కి బాగా నచ్చిన లూసిఫర్ రీమేక్ ను మొదట పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ గా మెగాస్టార్ చాలా పేర్లనే పరిశీలించారు.

 సుజిత్, వినాయక్ ల పేర్లు ముఖ్యంగా వినిపించాయి. లూసిఫర్ రీమేక్ ను తానే డైరెక్ట్ చేస్తున్నట్టు వినాయక్ ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించాడు. కాగా ఆ తరవాత వినాయక్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి తపుకున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో లూసిఫర్ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నదానిపై మరోసారి చర్చ మొదలయ్యింది. తాజా సమాచారం ప్రకారం లూసిఫర్ తమిళ దర్శకుడు మోహన్ రాజానే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కూడా రాంచరణ్ నిర్మాతగా కొణిదెల బ్యానర్ లో తెరకెక్కించనున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను హీరోయిన్ లేకుండానే తీస్తున్నట్టు సమాచారం.

More Related Stories