బిగ్ బాస్4.. ఈ వారం గుజరాతీ భామ ఔట్Monal Gajjar
2020-11-20 01:25:52

మొనల్ గజ్జర్ తెలుగులో సూడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలలో అల్లరి నరేష్ కు హీరోయిన్గా నటించింది. మొనల్  సినిమాల కన్నా కూడా బిగబాస్ తెలుగు 4 కాంటెస్టెంట్ గానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో చాలా సార్లు ఏలిమినేషన్స్ లో ఉన్నా మొనాల్ తపించుకుంది. అసలు 'కుమార్ సాయి' ఏలిమినేట్ అయిన వారమే మొనల్ ఎలిమినేట్ అవ్వాలని ..కానీ బిగ్ బాస్ చాలా ప్లాన్ గా సేవ్ చేసాడని బిగ్ బాస్ అభిమానులు విమర్శలు చేసారు. మొనల్ వెళ్ళిపోతే  బిగబాస్ లో గ్లామర్ తగ్గిపోతుందని, రేటింగ్లు పడిపోతాయని బిగ్ బాస్ టీమ్ ప్లాన్ గా మొనల్ ని సేవ్ చేస్తున్నారని  సోషల్ మీడియా లో ట్రోల్స్ కూడా వచ్చాయి.

వీక్స్ గడుస్తున్న కొద్దీ మొనల్ ని సేవ్ చేయలేక బిగబాస్ టీం కూడా అష్టకష్టాలు పడుతుంది. ఇక ముగింపుకు దగ్గరగా వచ్చిన ఈ తరుణంలో  మొనల్ ని నాగార్జున గారు కూడా సేవ్ చేయలేరని  తెలుస్తుంది. మొనల్... అఖిల్ తో చేసే రొమాన్స్ అనవసరపు ఏడుపులు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారాయి. వీటన్నింటితో పాటు ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అబిజీత్, హారిక, సోహల్, ఆరియన, లాస్య, మొనల్ లలో సోషల్ మీడియా లో జరుగుతున్న ఓటింగ్స్ లో అందరికన్నా మొనల్ కి తక్కువ ఓటింగ్ వస్తున్నట్లు తెలుస్తుంది. హాట్ స్టార్ లో కూడా మొనల్ కి ఎదురుదెబ్బ తగిలే అవశాలువున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి బిగబాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరు  ఏలిమినాట్ అవుతారో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు వేచిచూడాల్సిందే.

More Related Stories