అఖిల్ గురించి నన్నెందుకు అడుగుతున్నారు..మోనాల్



 Monal gajjar
2021-01-17 09:29:52

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ మోనాల్ గజ్జర్. మోనాల్ కు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాక ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ముఖ్యంగా హౌస్ లో అఖిల్ తో నడిచిన కెమిస్ట్రీ వల్లే హౌస్ లో ఎక్కువ కాలం ఉంటూ బయట పాపులర్ అయింది. హౌస్ నుండి బయట కు వచ్చాక కుడా మోనాల్ అఖిల్ జంట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మరోవైపు హౌస్ నుండి బయటకు వచ్చిన మోనాల్ ఫుల్ బిజీ అయ్యింది. సంక్రాంతికి విడుదలైన అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులేసింది. మరోవైపు టీవీ షోలలో కూడా సందడి చేస్తోంది. 

ఇదిలా ఉండగా ఇటీవల మోనాల్ కొంత బ్రేక్ తీసుకుని గుజరాత్ లోని తమ ఇంటికి వెళ్ళింది. అయితే తాజాగా మళ్ళీ హైదరాబాద్ చేరుకున్న మోనాల్ కు ఎయిర్ పోర్ట్ లో కొంత ఇబ్బంది కలిగించే ఘటనలు ఎదురయ్యాయి. మోనాల్ ను ఎయిర్ పోర్ట్ లో చూసిన వారు ఆమె దగ్గరకు చేరుకుని అఖిల్ ఎలా ఉన్నాడంటూ ప్రశ్నించారు. దాంతో మోనాల్ కు కొంత ఇబ్బంది పడింది. అఖిల్ వల్ల ఇంట్లో హ్యాపీగా ఉంటాడు. అతడి గురించి నన్నెందుకు ఆడుతున్నారు..అఖిల్ పేరుతో నన్ను పిలవడం కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పిందట. అసలు మోనాల్ పాపులర్ అయ్యింది అఖిల్ వల్లేనని అంతగా ఇబ్బంది పడటం ఎందుకని నెటిజన్లు అడుగుతున్నారు.

More Related Stories