అఖిల్ ను ముద్దులతో ముంచెత్తిన మోనల్



 Monal Gajjar
2020-12-19 11:24:51

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఈ ఆదివారంతో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఎంటర్ టైన్మెంట్ డోస్ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన ఇంటిసభ్యులను ఎప్పటిలాగే హౌస్ కు తీసుకువచ్చారు. కానీ ఈ సీజన్ లో కరోనా నిబంధనల కారణంగా టాప్ 5లో ఉన్న సభ్యులు, ఎలిమినేట్ అయిన సభ్యుల మధ్య ఓ అద్ధాన్ని ఏర్పాటు చేశారు. దాంతో అద్ధానికి ఓ వైపు టాప్ 5 కంటెస్టెంట్స్ మరోవైపు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఎలిమినేట్ అయిన వారిలో మొదట మోనాల్ గజ్జర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మోనాల్ వాయిస్ విని అఖిల్, సోహెల్ పరుగెత్తుకుంటూ వచ్చారు. 

ఆ సమయంలో బిగ్ బాస్ ఒక పాట వేయగా సోహెల్, మోనాల్ లు స్టెప్పులు వేశారు. అఖిల్ మాత్రం మోనాల్ ను చూస్తూనే ఉండిపోయాడు. ఇక కొంత గ్యాప్ రావడంతో అఖిల్ ను చాలా మిస్ అవుతున్నా అంటూ మోనాల్ అతడిని ముద్దులతో ముంచెత్తింది. అద్దం అడ్డుగా ఉన్నపటికీ అలానే ఇద్దరు హగ్ లు ఇచ్చుకున్నారు. మోనాల్ అద్దం అడ్డుగా ఉందని, లోపలికి రావాలని ఉందని చెప్పగా సోహెల్ కుర్చీ ఎక్కి జంప్ చెయ్ అని సలహా ఇచ్చాడు. దాంతో మోనాల్ వద్దులే అని చెప్పింది. ఇక మోనాల్ తరవాత లాస్య, కరాటే కల్యాణి వచ్చరు. వాళ్ళిద్దరిని సోహెల్ వంటలక్కలు వచ్చారు అంటూ ఆటపట్టించాడు. అనంతరం కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ లు వచ్చి సందడి చేసారు. ఇక చివరగా గంగవ్వ హౌస్ లోకి వచ్చింది.

More Related Stories