బిగ్ బాస్ తెలుగు4.. ట్రయాంగిల్ లవ్ స్టోరీపై క్లారిటీ ఇచ్చిన మోనల్Monal
2020-12-16 17:35:30

సుడిగాలి సినిమాలో హీరోయిన్ గా నటించిన మోనాల్ గజ్జర్ సినిమా హిట్ అయినా అంతగాపాపులారిటీ సంపాదించుకోలేదు. ఆ తరవాత పెద్దగా తెలుగు సినిమాల్లో కూడా కనిపించలేదు. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్-4 లోకి ఎంట్రీ ఇచ్చి మాత్రం తెగ పాపులర్ అయిపొయింది. ఎంతోమంది అభిమానుల మనసు దోచుకుంది. ముఖ్యంగా మోనాల్ హౌస్ లో అభిజిత్, అఖిల్ ల మధ్య జరిగిన సంభాషణలు ఈ సీజన్ కు హైలెట్ గా నిలిచాయి. మోనాల్ ఇద్దరితోనూ క్లోజ్ గా ఉండటం..వారిది ట్రయాంగిల్ స్టోరీలా బయటకు కనిపించడంతో ప్రేక్షుకులు ఎంతో ఆసక్తిగా షోను ఫాలో అయ్యారు. ఇక వందరోజులు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన మోనాల్ హౌస్ నుండి భయటకు వచ్చింది. దాంతో భయటకు వచ్చిన మోనాల్ గజ్జర్ ఓ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ అన్నింటిపై క్లారిటీ ఇచ్చింది. 

తమది ట్రయాంగిల్ లవ్ స్టొరీ కాదని చెప్పింది. అఖిల్ అంటే మొదటి నుండి తనకు అభిమానమని చెప్పింది.  హౌస్ లో ఎవరి సపోర్ట్ లేకపోయినా ఒకరికి ఒకరం తోడుగా ఉన్నామని చెప్పింది. ఎన్ని విషయాల గురించి మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళమని సరదాగా ఫ్లర్ట్ చేసుకునే వాళ్ళమని చెప్పింది. ఇక అభిజిత్ తనను అంతగా అర్థం చేసుకోలేదని...కానీ తన తల్లికి అభిజిత్ ఎంతగానో నచ్చాడని పేర్కొంది. తన తల్లిని కలవడానికే అభి అహ్మదాబాద్ వస్తానని చెప్పారని తెలిపింది. అంతే కాకుండా హౌస్ మేట్స్ కూడా ఇటీవల పెళ్లి చేసుకున్న తన అక్కను విష్ చేయడానికి అహ్మదాబాద్ వస్తామని చెప్పారంది.

More Related Stories