నవనీత్‌ కౌర్ కు కరోనా పాజిటివ్Navneet Kaur
2020-08-07 16:00:22

దేశంలో కరోనా వైరస్ అర్రలు చాస్తోంది. మొదట్లో ఇండియా మొత్తం మీద ఎన్ని కేసులు నమోదయ్యయో ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో అన్ని కేసులు నమోదవుతున్నాయి. ఇక మొదట సామాన్యులకే పరిమితం అయిన ఈ వైరస్ ఇప్పుడు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్ ఫ్యామిలీకి కరోనా సోకగా తెలుగులో దర్శకులు రాజమౌళి, తేజలకి కరోనా సోకింది. ఇక సింగర్స్ స్మిత, ఎస్పీ బాల సుబ్రమన్యానికి కూడా తాజాగా కరోన సోకింది. 

ఇక తాజాగా సినీ నటి, ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఆమె నివాసంలోని 11 మంది కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. ముందు నవనీత్ మామ గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్‌ అని తేలగా నవనీత్‌కు, ఆమె భర్తకు కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో నవనీత్ కు కరోనా అని తేలింది. అయితే నవనీత్, ఆమె భర్త రవి శాంపిల్స్ వైద్యులు తప్పుగా తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో వైద్యారోగ్య శాఖకు రవి రానా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మళ్లీ వీరిద్దరి శాంపిల్స్‌ తీసుకున్నా నవనీత్ రిపోర్ట్‌లో రిజల్ట్ పాజిటివ్‌ అని తేలింది. ఇక నవనీత్ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె బాలకృష్ణతో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించారు.

More Related Stories