బిగ్ బాస్ పై మెగా బ్ర‌దర్ ఆసక్తిక‌ర వ్యాక్యలు.. ఆయ‌న సపోర్టు ఆమెకేనా!bigg boss sai
2021-09-09 11:17:40

బిగ్‌బాస్ తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో ఓ ప్ర‌త్యేక ముద్ర వేసుకుంది. మొద‌టి సీజ‌న్ నుండి ప్ర‌స్తుత సీజ‌న్ వ‌ర‌కు కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకుంటుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ఈ నెల 5 నుంచి ప్రారంభమైన 5 సీజ‌న్ లో అన్ని ర‌కాల  ఎమోషన్లు పండుతున్నాయి, కొత్త‌ నవ్వులు పూస్తున్నాయి. ఒక్క‌రికి మించి ఒక్క‌రూ టాస్క్‌ల్లో ఇరుగ దీస్తున్నారు. హౌస్ లో  కంటెస్టెంట్లు నానా రచ్చ చేస్తూ రకరకాల ఎమోషన్స్ తో ప్రేక్షకులను టీవీల ముందు క‌ట్టి ప‌డేస్తున్నారు. ఈ రియాల్టీ షో సాధారణ‌ ప్రేక్ష‌కుల‌నే కాకుండా ప్ర‌ముఖ సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను సైతం ఆక‌ట్టుకుంటుంది.  ఈ క్ర‌మంలో ప్రముఖ సినీ నటుడు, మోగ బ్ర‌ద‌ర్ నాగబాబు ఈ షో పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  

ఈ షోలో ప‌లువురు న‌టులు, న‌టీమనులు , సోష‌ల్ మీడియా స్టార్లు పాల్లొంటున్నారు. అయితే..  ట్రాన్స్ జెండ‌ర్ ప్రియాంక సింగ్  మాత్రం ప్ర‌త్యేకం. ఎన్నో క‌ష్టాల‌కు ఓర్చి ఈ స్థాయికి వ‌చ్చింది. ఈ త‌రుణంలో ప్రియాంక సింగ్ పై నాగ‌బాబు ఆసక్తిక‌ర కామెంట్స్ చేశారు. ప్రియాంక అబ్బాయిగా ఉన్నప్పుడే తెలుసున‌నీ, ప్రియాంక చాలా కష్ట‌ప‌డి   స్థాయికి వచ్చాడని తెలిపారు.

ప్రియాంక గెలుస్తుందో? లేదో? తనకు తెలియదని... కానీ, తన పూర్తి మద్దతు మాత్రం ప్రియాంకకేనని చెప్పారు. ప్రియాంక సింగ్ కు మెగాబ్రదర్ నాగబాబు  ప‌లుమార్లు ఆర్థికసాయం చేశారు. ప్రియాంక అసలు పేరు సాయితేజ. అత‌డిది శ్రీ‌కాకుళం జిల్లా. ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత ప్రియాంక సింగ్ గా పేరు మార్చుకున్నారు.  

More Related Stories