ఉప్పెన ద‌ర్శ‌కుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత‌లు



uppena
2021-03-26 11:14:05

ప్ర‌స్తుతం హిట్ సినిమా ఇచ్చిన ద‌ర్శ‌కుల‌కు కాస్ట్లీ గిఫ్ట్ లు ఇవ్వ‌డం టాలీవుడ్ లో అలవాటుగా మారిపోయింది. ఇప్ప‌టికే ప‌లువురు ద‌ర్శ‌కులకు నిర్మాత‌లు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి స‌ర్పైజ్ చేశారు. కాగా తాజాగా ఉప్పెన సినిమా ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌నకు నిర్మాత‌లు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. దాదాపు రెండు రూ.75 ల‌క్ష‌ల విలువ చేసే బెంజ్ కారును నిర్మాతలు నవీన్ ఎర్నేని, ఎలమంచి ర‌వి శంక‌ర్ లు బుచ్చిబాబు కు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక బుచ్చిబాబు ఈ ఆనందాన్ని మొద‌ట త‌న గురువు క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ తో పంచుకున్నారు. 

సుకుమార్ తో క‌లిసి బుచ్చిబాబు ఫ‌స్ట్ రైడ్ కు వెళ్లారు. ఇదిలా ఉండ‌గా మెగామేన‌ల్లుడు హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన సినిమా ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైంది. ఈ సినిమాకు మొద‌టి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. అంతే కాకుండా 2021లో ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన సినిమాల్లో ఉప్పెన సినిమా అత్య‌ధిక వ‌సూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా న‌టించింది. ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ సేతుప‌తి విలన్ గా న‌టించారు. సినిమాలో విజ‌య్ సేతుప‌తి తో పాటు తొలి సినిమానే అయినా కృతిశెట్టి మరియు వైష్న‌వ్ తేజ్ లు ప‌ర్ఫామెన్స్ ను చింపేశారు. 

More Related Stories