మైత్రి వాళ్ళు మామూలోళ్లు కాదుగాMythri Movies Makers
2021-02-12 18:39:54

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీగా సినిమాలను ప్లాన్ చేసి అవాక్కయ్యేలా చేస్తోంది. టాలీవుడ్ లోకి మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాను తీసి మరో హిట్ అందుకుంది. ఆ తరవాత చరణ్ తో తీసిన "రంగస్థలం" కూడా సూపర్ డూపర్ హాయ్ గా నిలిచింది. వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో చిన్న పెద్ద సినిమాలను లైన్ లోపెడుతూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ప్రస్తుతం మొత్తం 12 సినిమాలను లైన్ లో పెట్టి భారీగా చేస్తోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన ఫిబ్రవరి 12న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరోవైపు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తో పుష్ప కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక నాని హీరోగా తెరకెక్కుతున్న "అంటే సుందరానికి"  సినిమాను కూడా మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 

మరోవైపు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాకు ఇప్పటికే కొబ్బరికాయ కొట్టేసింది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా, విజయ్ దేవరకొండ శివ నిర్వాణతో ఒక చిత్రం, చిరంజీవి బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా, బాలయ్య గోపీచంద్ మలినేని తో ఒక సినిమా లైన్ లో ఉన్నాయి. అంతే కాకుండా ప్రభాస్ , తమిళ స్టార్ హీరో విజయ్ ల డేట్స్ కూడా మైత్రీమూవీ మేకర్స్ చేతుల్లో ఉండటం విశేషం. ఇక సౌత్ హీరోలతోనే కాకుండా ఏకంగా బాలీవుడ్ లోను సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దానికోసం ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారని గుసగుసలు వినిఇస్తున్నాయి. ఈ సంస్థ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి దేశంలోనే టాప్ నిర్మాణ సంస్థగా ఏర్పాటు చేసేందుకు గట్టిగా కృషి చేస్తునట్టు కన్పిస్తోంది. 

More Related Stories