ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా అలా ఉండబోతుందా..Nag Ashwin
2020-02-27 14:16:23

మహానటి లాంటి సంచలన సినిమా తర్వాత నాగ్ అశ్విన్ రెండేళ్లుగా ఖాళీగానే ఉన్నాడు. ఈయన తలుచుకుంటే వెంటనే మరో సినిమా మొదలు పెట్టేవాడు. కానీ పూర్తి స్క్రిప్ట్ రాసుకుని తర్వాత కానీ మరో సినిమా మొదలు పెట్టకూడదని ముందుగానే ఫిక్స్ అయిపోయాడు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత కూడా మహానటి కోసం దాదాపు మూడేళ్లు పైనే తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేశాడు ఈ కుర్ర దర్శకుడు. మహానటి తర్వాత చిరంజీవితో సినిమా చేయడానికి నాగ్ అశ్విన్ సన్నాహాలు చేసుకున్నాడు. అయితే ఎందుకో ఆ కథ వర్కవుట్ కాలేదు. కానీ అంతకంటే పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు సెట్ చేశాడు ఈ సంచలన దర్శకుడు. 

ఏకంగా ప్రభాస్ ని హీరోగా పెట్టి పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తునాడు నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ఈ సినిమా రాబోతుంది. ఈ నిర్మాణ సంస్థ మొదలుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభాస్ సినిమా అనౌన్స్ చేశారు. బాహుబలి, సాహో లాంటి సినిమాలతో ప్రభాస్ ఇప్పటికే నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఇమేజ్ క్యాష్ చేసుకుంటూ నాగ్ అశ్విన్ అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కథ ఒకటి సిద్ధం చేశాడని తెలిసింది. టైం మిషన్ కూడా ఇందులో ఉంటుందని ఆ తరహా కథతోనే ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతుంది. 

ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారు. మహానటి సినిమా తీసిన విధానం చూసిన తర్వాత నాగ్ అశ్విన్, ప్రభాస్ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే పెరిగిపోతున్నాయి. దానికి తోడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు.. సాహో సినిమాలో ప్రభాస్ ఎప్పుడో ఇండియా స్టార్ అయిపోయాడు. అందుకే నేను ఫ్యాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నాగ్ అశ్విన్. వీలైనంత త్వరగా ఈ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు ప్రభాస్. మరి ఈ టైం మిషన్ కథతో ఇద్దరూ ఎలాంటి మాయ చేస్తారో చూడాలి. 

More Related Stories