పవన్ కళ్యాణ్‌కు తలనొప్పిగా మారుతున్న నాగబాబు.. Naga Babu
2020-06-01 11:39:28

ఏమో ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. అన్నయ్య చేస్తున్న పనులకు నిజంగానే పవన్ తల పట్టుకుంటున్నాడని.. అతన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తికమకపడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కేవలం హీరో మాత్రమే కాదు రాజకీయ నాయకుడు కూడా. ఈయనే కాదు.. ఈయన కుటుంబంలో ఎవరేం చేసినా అందర్నీ కలిపి అనేస్తారు. ఇప్పుడు నాగబాబు చేస్తున్న పనులకు పవన్ ఇలాగే ఇబ్బంది పడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎందుకో తెలియదు కానీ వివాదాస్పద వ్యాఖ్యలతో రోజూ వార్తల్లో ఉంటున్నాడు నాగబాబు. ఆ మధ్య గాడ్సే జయంతి రోజున గాంధీపై వరస ట్వీట్స్ తో వివాదాలకు తెర తీసాడు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆర్ఎస్ఎస్ వెనకుండి చేయిస్తుందంటూ కొందరు విమర్శలు చేస్తున్న వేళ పవన్ కళ్యాణ్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాడు. 

నాగబాబు వ్యాఖ్యలపై జనసేన పార్టీ ప్రకటన జారీ చేసింది. జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న నాయకులు, జనసైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగతం. పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. గతంలో కూడా ఈ విషయం చెప్పాం. మరోసారి కూడా చెబుతున్నాం. నాగబాబు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి. వాటికి, పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు. పార్టీ నిర్ణయాలు, అభిప్రాయాలు అధికార పత్రం, పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తాం. వాటినే పరిగణనలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సంతకంతో జనసేన పార్టీ ప్రకటన జారీ చేసింది. అంటే నాగబాబు చేస్తున్న కామెంట్స్ వెనక తాను లేనని చెప్పే ప్రయత్నం చేసాడు పవన్. 

ప్రస్తుతం ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ నాయకులు.. కార్యకర్తలు అందరూ ప్రజాసేవ గురించి ఆలోచించాలని.. మరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని పవన్ కళ్యాణ్ కోరాడు. క్రమశిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేసాడు. అది మరిచిపోయేలోపు బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగుదేశంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బిజేపీ వస్తాయో రావో తెలియదు కానీ కచ్చితంగా టీడీపీ మట్టుకు రాదు అంటూ మరోసారి కామెంట్ చేసాడు. ఇవన్నీ పవన్ చేయిస్తున్నాడంటూ కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. దాంతో అన్నయ్య పనులు తమ్ముడికి తలనొప్పి తీసుకొస్తున్నాయి. మరి నాగబాబు దీన్ని ఎప్పటికి అర్థం చేసుకుంటాడో చూడాలిక. 

More Related Stories