అనుకున్నా చేసి చూపించానంటున్న మెగా బ్రదర్ Naga babu
2020-02-01 11:38:04

ప్రస్తుతం అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. అది అందం మీదా ఆకర్శణీయమైన దేహం మీద ఆశో ఏమో అర్ధం కావడంలేదు కానీ వయసులతో సంబంధం లేకుండా అందరూ జిమ్ లో కష్టపడి స్లిమ్ లుక్ లోకి మారుతున్నారు. అదే బాటలో నటుడు, నిర్మాత నాగబాబు భారీకాయం నుంచి స్లిమ్ గా ఆకర్షణీయంగా తయారయ్యారు. అంతే కాదు  అనుకున్నాను సాధించాను.. అంటూ తన పాత కొత్త ఫోటోలను జత చేసి అభిమానులతో పంచుకున్నాడు. 

మిత ఆహారంతో పాటు రెండు పూటలా తగు శారీరక వ్యాయామం తనను ఇలా మార్చిందని తెలిపాడు. అంతేకాదు సన్నగా ఉండడమే ఆరోగ్యానికి మేలని ఆయన అంటున్నాడు. తనకు బరువు తగ్గడానికి ఆరు నెలలు పట్టిందని పేర్కొంటూ.. మూడు ఫొటోలను మిక్స్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అందుకోసం రోజుకు ఒక పూట మాత్రమే తింటూ ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు వ్యాయామం చేసానని నాగబాబు తెలిపాడు. అది అలా ఉంటే ప్రస్తుతం నాగబాబు జబర్ధస్త్‌ను వదిలేసి జీ తెలుగులో అదిరింది అనే షోకి జడ్జ్‌గా చేస్తున్నాడు. ఈ కొత్త కామెడీ షో కూడా ప్రేక్షకుల్నీ ఒక మాదిరిగా బాగానే ఆకట్టుకుంటోంది.

More Related Stories