జబర్దస్త్ కామెడీ షోలో నాగబాబు ప్లేస్ రిప్లేస్ చేసేది ఎవరంటే..Naga Babu
2019-11-19 19:56:32

ఏడేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోలో ఉన్నాడు నాగబాబు. ఆయన నవ్వులకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ నవ్వులకు ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరికి వచ్చేసింది. ఇన్ని రోజులు రూమర్స్ అనుకున్నారు కానీ నిజంగానే ఇప్పుడు నాగబాబు జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేసాడు. దానికి కారణాలు పెద్దగా ఏం లేవు.. సింపుల్ డబ్బులు ఎక్కువిస్తున్నారు అక్కడ్నుంచి ఇక్కడికి వచ్చేసాడు. అంతకంటే మరో కారణాలు కూడా కనిపించడం లేదు. ఈటీవీ నుంచి ఇప్పుడు జీ టీవీకి మారిపోయాడు ఈయన. ఆయనతో పాటు అనసూయ కూడా వచ్చేసింది. ఇప్పటికే జీ తెలుగులో ప్రోమోలు కూడా వరసగా విడుదలవుతున్నాయి. దాన్నిబట్టి చూస్తుంటే నాగబాబుకు జబర్దస్త్ కామెడీ షోతో ఉన్న అనుబంధం తెగిపోయినట్లే కనిపిస్తుంది. 

నాగబాబు బయటకు వచ్చేయడంతో ఆయన స్థానంలోకి ఎవరో ఒక జడ్జ్ ను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు మల్లెమాల ప్రొడక్షన్స్. అయితే  మెగా బ్రదర్ స్థాయిలో  ఈ షో ను ముందుకు తీసుకెళ్ళేది ఎవరు అనే విషయంలో  వాళ్లు తర్జనభర్జన పడుతున్నారు.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సాయికుమార్, కమెడియన్ అలీ, బండ్లగణేష్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఈటీవీ లో ఇప్పటికే పలు షోస్ చేస్తున్న సాయి కుమార్,  అలీ పేర్లు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఒప్పుకొని పక్షంలో  బండ్ల గణేష్ పేరు  పరిశీలించనున్నారు మల్లెమాల టీం. మరి రోజా కూడా కంటిన్యూ అవుతుందా లేదంటే ఆమె కూడా మానేస్తుందా అనేది చూడాలిక.

ప్రస్తుతం నాగబాబుతో పాటు అనసూయ కూడా వచ్చేసింది. పటాస్ నుంచి రవి కూడా తప్పుకున్నాడు. ఇలా అంతా ఒకేచోట చేరి మరో కొత్త ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే వీళ్లతో పాటు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఛమ్మక్ చంద్ర టీమ్స్ కూడా వచ్చేస్తున్నాయని తెలుస్తుంది. వాళ్లు కానీ వచ్చారంటే జబర్దస్త్ కామెడీ నడవడం కూడా కష్టమే అవుతుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో.

More Related Stories