గాడ్సే ఎఫెక్ట్ ...రాజకీయాలకు నాగబాబు బైబై Naga Babu
2020-05-22 18:02:28

మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడని సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆయన మహాత్మా గాంధీని కించపరిచారంటూ పోలీస్ స్టేషన్‌ లో కేసు కూడా నమోదయింది. నిజానికి ఆయన ఏమని ట్వీట్ చేసారంటే "ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ " అంటూ ఆయన కామెంట్ చేశారు. 

అయితే ఈ వ్యవహారం మీద అన్ని  వైపుల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తు తుండడంతో జాతిపిత మహాత్మా గాంధీజీని హత్య చేసిన ఓ హంతకుడిని నిజమైన దేశ భక్తుడని ఎలా అంటారని చాలా మంది కార్నర్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నాగబాబును టార్గెట్ చేస్తున్నారు. అదీ కాక ఆయన ఉన్న పార్టీ జనసేన బీజేపీ పంచన చేరడంతో ఇప్పుడు కాంగ్రెస్ కి ఆయన టార్గెట్ అయ్యాడు. అందుకే ‘నేను ఏ అంశంపైన అయినా ట్వీట్ చేసినా.. అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబ సభ్యులకుగానీ నా అభిప్రాయాలలో ఎటువంటి ప్రమేయం లేదు’ అని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఇది జనసేనకి నష్టం చేస్తుందని అంటున్నారు. ఎందుకంటే సాధారణంగా పవన్ ఎక్కువగా గాంధేయ వాదం గురించి ప్రచారం చేస్తారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా గాడ్సేని నాగబాబు నెత్తిన ఎక్కించుకోవడం ఇప్పుడు జనసేనకు ఇబ్బందిగా మారింది. 

ఎందుకంటే నిజానికి అసలు ఇప్పటి దాకా పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు గాని, జాతీయ అంతర్జాతీయ అంశాలపై ఎక్కడ సీరియస్ గా వ్యాఖ్యానించిన సందర్భాలు లేవు. కానీ ఎందుకో నాగబాబు గాడ్సే అంశాన్ని తెరకెత్తుకున్నారు. దీనిపై విమర్శలు వస్తాయని ముందే తెలిసినా, దీనిపై మాట్లాడడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఆర్జీవీ నాగబాబును సపోర్ట్ చేసిన పవన్ ఈ విషయంలో తన అన్న వ్యాఖ్యలు సమర్ధించలేక, విమర్శించలేక సతమతమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం నాగబాబు రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడేలా చేస్తుందనే వాదన వినిపిస్తోంది. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 

More Related Stories