మరో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన వెంకీ మామ రచయిత Naga Chaitanya Akhil
2019-12-19 22:25:47

వెంకటేష్ నాగచైతన్య నటించిన వెంకీ మామ గత శుక్రవారం విడుదలయింది. ఇద్దరు స్టార్ హీరోలున్నా బలమైన కథ లేదని విమర్శకులు తేల్చేశారు. జాతకాలు అనే రొటీన్ పాయింట్ పట్టుకొని, ఇంకాస్త రొటీన్ డైరెక్షన్ తో ఈ సినిమాని నడింపించేశారు. అయితే ఆమాత్రం కథ వాడటానికి చిత్ర యూనిట్ చాలా ఖర్చు పెట్టింది. ఈ కథ తయారు చేయడానికి కోటి రూపాయలు ఖర్చు అయిందట. జనార్ధన మహర్షి తీసుకొచ్చిన కథ కాగా ఈ కథ ఇచ్చినందుకు 20 లక్షల వరకు ఇచ్చారట. ఆ తర్వాత కోన వెంకట్ చేతిలో పడగా బాబీ, కోన వెంకట్ మరో ఇద్దరూ రచయితలు కలసి ఈ కథని సానబెట్టి చివరకు దానిని ఒక రూపు తెచ్చారు. జనార్ధన మహర్షి ఈ కథ తెచ్చేటప్పుడు అందులో మిలటరీ ఎపిసోడ్ లేకపోగా కోన దాన్ని యాడ్ చేశాడు. రావు రమేష్ ట్రాక్ మరో కొత్త రచయిత యాడ్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ అనుభవంతో ఈ కొత్త రచయిత మరో మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేశాడట. ఆ కధను అక్కినేని అఖిల్, చైతూలను దృష్టిలో పెట్టుకుని రాశాడని అంటున్నారు. ఆ కధను అక్కినేని కాంపౌండ్ లో వినిపించాడని త్వరలోనే ఆ సినిమా ప్రయత్నాలు చేయచ్చని అంటున్నారు. 

More Related Stories