అజయ్ భూపతి మహా సముద్రం నుండి వరుస షాక్స్  Naga Chaitanya
2019-11-19 11:07:34

‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి హిట్‌తో తెలుగు చిత్రసీమ దృష్టిని ఆకర్షించిన  యువ దర్శకుడు అజయ్‌ భూపతి. తన తర్వాతి చిత్రాన్ని పట్టాలెక్కించడానికి మాత్రం ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఆయన ‘మహా సముద్రం’ పేరుతో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. ఈ కథ అనేక మంది హీరోల చుట్టూ తిరగ్గా చివరికి రవితేజ దగ్గరికి వెళ్ళింది. ఆయన ముందు ఒప్పుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. దీంతో ఇదే కథను విశ్వక్‌ సేన్‌ - కార్తికేయలతో కలిసి చేస్తున్నాడని కూడా న్యూస్ వచ్చింది. కానీ, ఇది కూడా ఎందుకో సెట్‌ కాలేదు. 

నిజానికి మహా సముద్రం కథ తొలుత నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్నారట. అయితే అప్పట్లో మజిలీ చిత్రంతోనూ, అలాగే తదుపరి ప్రాజెక్టులతో నాగచైతన్య బిజీగా ఉండటంతో అజయ్‌ భూపతి వెంటనే రవితేజను కలిశారట. రవితేజ హ్యంద్ ఇవ్వడంతో ఇప్పుడు మళ్ళీ నాగచైతన్య దగ్గరకే మహాసముద్రం ప్రాజెక్టు వెళ్లిందట. 

అయితే ఈ సినిమాలో రెండో హీరో పాత్ర దర్శకుడే పోషిస్తున్నాడట. ఆ పాత్ర నెగటివ్ రోల్ కావడంతో ఎవరూ చేయడనికి ముందుకు రావడం లేదని అందుకే ఆయన ఈ సినిమాలో నటించడానికి ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఆయనకు స్క్రీన్ అప్పియరెన్స్ కొత్త కాదు. ఆర్జీవీ సినిమాల్లో మాటల్లేని జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు కొన్ని వేసినా ఇప్పుడు మెయిన్ విలన్ గా నటించడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాని జెమిని కిరణ్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రారంభం కానుందని అంటున్నారు. చూడాలి అజయ్ భూపతి ఏమేరకు మెప్పిస్తాడో ?  

More Related Stories