చై సామ్ ల ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే



Naga chaitanya
2021-05-06 13:40:52

ఏమాయ చేసావే సినిమాతో స‌మంత మాయ‌లో ప‌డిన చైతూ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి త‌ర‌వాత వీరిద్ద‌రి కెరీర్ కూడా డబుల్ స్పీడ్ లో వెళుతోంది. ప్ర‌స్తుతం సామ్ సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ లు టాక్ షోలు చేస్తూ చేతి నిండి సంపాదిస్తోంది. మ‌రోవైపు చైతూ కూడా చేతి నిండి సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా వీరిద్ద‌రి సంపాద‌న టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

సమంత సంపాద‌న విష‌యానికి వ‌స్తే టాలీవుడ్ లో కొన్నేళ్లుగా టాప్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న స‌మంత ఒక్కో సినిమాకు 2 కోట్ల వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంద‌ట‌. దాంతో ఇప్ప‌టి వ‌ర‌కూ సామ్ దాదాపు 85 కోట్ల వ‌ర‌కు వెన‌కేసింద‌ట‌. అంతే కాకుండా సామ్ ప్రీ స్కూల్ తో పాటు మ‌రోబిజినెస్ ను కూడా  మొద‌లు పెట్టింది. ఈ బిజినెస్ లో కూడా భాగానే సంపాదిస్తుంద‌ట‌. 

ఇక చైతూ విష‌యానికి వ‌స్తే టాలీవుడ్ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ హిట్ లు కొడుతున్నాడు. చైతూ కూడా త‌న రెమ్యున‌రేష‌న్ ను పెంచిన‌ట్టు తెలుస్తుంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమాల ద్వారా చైతూ దాదాపు రూ.40 కోట్ల వ‌రకూ సంపాదించార‌ట‌. అంతే కాకుండా ఇప్ప‌టికే చైతూకి రూ.125 కోట్ల వ‌ర‌కూ ఇత‌ర ఆస్తులు కూడా ఉన్నాయ‌ట‌. మొత్తం మీద వీరిద్ద‌రి సంపాద‌న మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా వెలిగిపోతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

More Related Stories