అమీర్ ఖాన్ సినిమాలో అక్కినేని హీరో.. వివరాలు ఇవే



 Naga Chaitanya
2021-03-15 13:21:29

అక్కినేని హీరోలకు బాలీవుడ్ కొత్త కాదు. నాగార్జున ఇప్పటికే అక్కడ తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటించాడు నాగార్జున. ఇక ఇప్పుడు ఆయన తనయుడు నాగచైతన్య కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఉత్తరాది సూపర్‌స్టార్స్‌లో ఒకరైన అమీర్‌ ఖాన్‌ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో నాగచైతన్య నటించబోతున్నాడు. అమీర్ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న 'లాల్‌ సింగ్ చద్దా' సినిమాలో చైతు కూడా నటించబోతున్నాడు. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అద్వైత్‌ చందన్‌ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అమిర్‌ సరసన కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రెండో సారి తల్లయిన కారణంగా కరీనా కపూర్ పాత్రను ముందుగానే ముగించేశాడు దర్శకుడు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. 2021 డిసెంబర్‌ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ పాత్ర కోసం ముందు తమిళ హీరో విజయ్ సేతుపతి తీసుకున్నారు. కాని ఆయన డేట్స్ కుదరకపోవడంతో ఇప్పుడు నాగచైతన్య ఈ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం నెల రోజుల పాటు డేట్స్‌ కేటాయించాడు. మే నెల నుంచి షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

More Related Stories