సిక్స్ ప్యాక్ లుక్ ..వైరల్ అవుతున్న నాగశౌర్య ఫోటోnaga shaurya
2021-06-15 12:47:25

టాలీవుడ్ కు లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చిన హీరో నాగ శౌర్య. మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే చిత్రంతోనే ప్రేక్షకుల నాగ శౌర్య ప్రేక్షకుల మనసు దో. అంతేకాకుండా లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం నాగశౌర్య డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతే కాకుండా కొత్త కొత్త లుక్ లతో ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా నాగ శౌర్య ప్రస్తుతం సిక్స్ ప్యాక్ బాడీ పెంచి మ్యాచో లుక్ తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా నాగ శౌర్య జిమ్ వర్క్ ఔట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఫోటోలో  సిక్స్ ప్యాక్ బాడీతో నాగ శౌర్య మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే "శౌర్య" సినిమా కోసం నాగ శౌర్య వర్క్ ఔట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. దాంతో నాగ శౌర్య తన వ్యాయామాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ లవర్ బాయ్ హీరో ప్రస్తుతం శౌర్య సినిమాతో పాటు వరుడు కావలెను అనే సినిమాలో సైతం నటిస్తున్నారు. అంతే కాకుండా ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి అనే సినిమాలోనూ నటిస్తున్నాడు.

More Related Stories