నాగబాబు మరో సంచలన పోస్ట్..మొహం పగలగొట్టు అంటూNagababu
2020-10-10 17:18:45

మెగా బ్రదర్ నాగబాబు ఎదో ఒక అంశంపై మాట్లాడటం అది వివాదాలకు దారితీయడం సాధారణమైపోయింది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒక వర్గాన్ని ఉద్దేశించి చేసినట్టుగా వుంది. దీనికి కారణం ఇటీవల నాగబాబు మొదలు పెట్టిన ఓ కామెడీ షోలో ప్రదర్శించిన ఓ స్కిట్ లో ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించినట్టు ఉందని జగన్ ఫ్యాన్స్ నాగబాబు పై ట్రోల్స్ చేస్తున్నారు. దాంతో నాగబాబు ఫైర్ అయ్యారు. ట్రోల్స్ కి సమాధానంగా రాయల్ హెయిర్ ఆయిల్..వెంట్రుకక్ కూడా పీకలేరు అంటూ వివాదాస్పద పోస్ట్ చేశారు. అంతే కాకుండా సింహాసనంలో కుక్క కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసారు. దాంతో జగన్ అభిమానులు ట్రోల్స్ మరింత ఎక్కువ చేశారు. దాంతో మరోసారి నాగబాబు సంచలన పోస్ట్ చేసారు. "ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం పిరికివాడి లక్షణం, వాడు ఒక చెంపమీద కొడితే వాడి మొహం పగలగొట్టాలి" అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే తనపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో వారికి గట్టిగా సమాధానం చెప్పేందుకు నాగబాబు ఈ పోస్ట్ చేసారని అనుకుంటున్నారు. అయితే ఈ వివాదంపై జనసేన అభిమానులు మాత్రం నగబాబుకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.

More Related Stories