లాక్ డౌన్ తర్వాత అదిరిందిపై నాగబాబు సంచలన నిర్ణయం..nag
2020-04-18 13:43:30

జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత తన కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు నాగబాబు. నవ్వుల నవాబుగా పేరున్నా కూడా అదిరిందిలో మాత్రం ఈయన మార్క్ చూపించడం లేదు. ఇప్పుడు ఈయనకు నిజంగానే ఇప్పుడు నాగబాబుకు అదిరిపోయే షాక్ తగిలింది. రేటింగ్స్ పరంగా అదిరింది బాగా వెనకబడిపోయింది. ఈ షోకు కనీసం 6 రేటింగ్ కూడా రావడం లేదని తెలుస్తుంది. మూడు నాలుగు నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు కనీసం మార్క్ చూపించలేకపోవడంతో నాగబాబు కూడా ఆలోచనలో పడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈయన ఈటీవీలో మానేసి జీ తెలుగులో అదిరింది అంటూ కొత్త ప్రోగ్రాం మొదలు పెట్టాడు. అక్కడి దర్శకులే ఇక్కడ కూడా చేస్తున్నారు. కానీ అక్కడి ఫలితం మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. జబర్దస్త్ కు పోటీగా వచ్చిన ఈ షోపై ముందునుంచి అంచనాలు బాగానే ఉన్నాయి.. ఇప్పటికే ఈషా వచ్చి రెండు వారాలు ముగిసింది. మూడోవారం రేటింగ్స్ కూడా బయటకు వచ్చాయి. కానీ వచ్చిన తర్వాత కానీ తెలియలేదు జబర్దస్త్ కు అదిరిందికి ఉన్న తేడా ఏంటో. సేమ్ టు సేమ్ జబర్దస్త్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వాడుకుంటూ షో చేస్తున్నారు నాగబాబు అండ్ గ్యాంగ్.


పాత టీమ్ లీడర్స్ ఇక్కడ చేస్తున్నా కూడా ఎందుకో మరి ప్రేక్షకులు మాత్రం కనెక్ట్ కావడం లేదు. జబర్దస్త్ షోలో డిజైన్ చేసిన దర్శకులు నితిన్ భరత్ ఇప్పుడు అదిరిందిని డైరెక్ట్ చేస్తున్నారు. కానీ భారీ అంచనాలతో వచ్చిన అదిరింది షో టి ఆర్ పి పరంగా మాత్రం అంతగా ఆదరణ లేదు. ఎందుకో తెలియదు కానీ ఈ షోకు రేటింగ్ పెద్దగా రావడం లేదు. దానికి తోడు జీ తెలుగులో అదిరింది వస్తున్న సమయంలోనే ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో ఎలాంటి ads లేకుండా రిపీట్ షో వేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు ఎక్కువగా దానికే కనెక్ట్ అవుతున్నారు. పాత స్కిట్స్ అయినా కూడా అక్కడ కామెడీ వర్క్ ఔట్ కావడం జబర్దస్త్ బ్రాండ్ తో రేటింగ్స్ బాగా వస్తున్నాయి. ఇదే సమయంలో నాగబాబుకి మాత్రం అదిరింది షాక్ ఇస్తుంది. దీనికి అనుకున్న రేటింగ్ రాకపోతే కచ్చితంగా ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకోవడానికి జీతెలుగు ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అదిరింది రేటింగ్స్ పెంచడానికి నాగబాబు చాలా ట్రై చేస్తున్నాడు. జబర్దస్త్ కి పోటీగా వచ్చినా అదిరింది స్థాయికి తగ్గట్లుగా అదరగొట్టడానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అదిరింది షో నుంచి ఈయన తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

More Related Stories