ఐటీ రైడ్స్ మీద స్పందించిన నాగార్జునnag
2019-11-23 08:10:57

రెండ్రోజుల క్రితం టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఇటీవల ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్, దగ్గుబాటి ఫ్యామిలీపై మాత్రమే కాక నేచురల్ స్టార్ నాని ఇల్లు, నిర్మాణ సంస్థ ఆఫీస్ మీద కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. అలాగే, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ వంటి నిర్మాణ సంస్థలపై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారని వార్తలు వచ్చాయి. వీరితో పాటుగా నాగార్జున ఇల్లు, అన్నపూర్య స్టూడియోస్ బ్యానర్ మీద కూడా సోదాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం మీద అయితే ఎటువంటి అధికారిక సమాచారం లేదు. దీంతో నాగార్జున సన్నిహితులు ఆయనకు ఫోన్ చేసి మీ ఆస్తులపై ఐటీ రైడ్స్ జరిగాయట కదా అని అడిగారట. దీంతో ఆయన ఈ విషయాన్ని నిన్న రాత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఐటీ అధికారులు మీ ఆస్తులపై సోదాలు జరిపారా అంటూ తన స్నేహితుల్లో కొంత మంది ఫోన్లు చేసి అడిగారని తన మీద వచ్చిన ఈ వార్తలు చాలా ఇబ్బందికరంగా అనిపించాయని ఎటువంటి  సోదాలు తన మీద కానీ తన కార్యాలయాలపై కానీ జరగలేదని ట్వీట్‌ లో క్లారిటీ ఇచ్చారు.

More Related Stories