కొడుకుతో నాగార్జున మల్టీస్టారర్ Nagarjuna Akhil
2021-03-24 23:57:01

అరవై ఏళ్ల వయసులోనూ నాగార్జున ఇరవై ఏళ్ళ కుర్రాడిలా కనబడుతూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఫిట్నెస్ విషయంలోనూ నాగ్ కొడుకులకు పోటీ ఇస్తూనే ఉంటారు. అంతే కాకుండా సినిమా హిట్ అయినా ఫట్ అయినా పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటారు. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నాగార్జున త్వరలో తన చిన్న కొడుకుతో కలిసి ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నారట. ఇప్పటికే నాగ్ నటించిన మనం సినిమాలో అఖిల్ కనిపించగా ఈ సారి సినిమా మొత్తం తండ్రి కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. ప్రస్థుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మరోవైపు అఖిల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రస్తుతం మెగాస్టార్ తో లూసిఫర్ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్న మోహన్ రాజా తెరకెక్కించబోతున్నారట. మోహన్ రాజా నాగ్ అఖిల్ కోసం యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశారట. ఇక ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.

More Related Stories