సెకండ్‌ షెడ్యూల్‌ కు సిద్దమవుతున్న నాగ్ ప్రవీణ్‌ సత్తారు



Nagarjuna
2021-05-17 11:18:44

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌మరార్‌ నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగ్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ను జూన్‌ తొలివారంలో ప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌లో నాగార్జున, కాజల్‌ అగర్వాల్‌లపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారని తెలుస్తుంది.

ఇక ఆయన నటించన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయన’ 2015 లో విడుదలై మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ సీక్వెల్‌లో హిందీ నటి సోనాక్షి సిన్హా నటించనుందట. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. 

More Related Stories