నాగార్జునను ఆలోచనలో పడేసిన బిగ్ బాస్..  Nagarjuna
2019-10-23 18:16:25

బిగ్ బాస్ తర్వాత నాగార్జున ఏం చేయబోతున్నాడు.. ఈ అనుమానం ఇప్పుడు అక్కినేని అభిమానులతో పాటు ఇండస్ట్రీలో చాలామంది దర్శక నిర్మాతలకు కూడా ఉంది. మూడు నెలల నుంచి బిగ్ బాస్ తప్ప మరో ఆలోచన లేకుండా ఉన్నాడు నాగార్జున. కొన్ని రోజుల కింద మన్మధుడు 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. పైగా నాగార్జునకు విమర్శలు కూడా తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ వయసులో ఇలాంటి సినిమాలు చేయడం అవసరమా అంటూ ఆయనకు సోషల్ మీడియాలో చాలా సెటైర్లు వచ్చాయి. దాంతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు నాగార్జున. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన బంగార్రాజు కథ సిద్ధంగా ఉన్నా కూడా దానికంటే ముందు మరో సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు అక్కినేని వారసుడు.

ప్రస్తుతం బిగ్ బాస్ తప్ప మరో ఆలోచన లేకుండా ఉన్నా.. మరో రెండు వారాల్లో మూడో సీజన్ ముగుస్తుంది. మొదట్లో నాగార్జున హోస్టింగ్ పై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కూడా రాను రాను అది నెగిటివ్ గా మారిపోయింది. ఎన్టీఆర్, నానితో పోలిస్తే నాగార్జున అంత బాగా చేయలేదు అంటూ ఓపెన్ గానే కొంతమంది సోషల్ మీడియాలో నాగార్జున హోస్టింగ్ పై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే మన్మధుడు 2 తీసుకొచ్చిన చెడ్డ పేరు ఎలాగైనా పోగొట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు నాగార్జున. అందుకే బంగార్రాజు లాంటి సినిమా కాకుండా ఒక హుందాతనం ఉన్న పాత్రలో రావాలని ప్రయత్నిస్తున్నాడు అక్కినేని నాగార్జున. దీనికోసం హిందీలో మంచి విజయం సాధించిన రైడ్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం నాగార్జునకు చక్కగా సరిపోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది.
 

More Related Stories