అందరినీ వణికించి పారేసిన నాగ్nagbig
2019-09-15 07:05:22

బిగ్‌బాస్ రియాలిటీ షోలో నిన్నటి ఎపిసోడ్ నాగార్జున కోపానికి కేరాఫ్ గా నిలిచింది. షో రూల్స్‌ను అతిక్రమించిన ఇంటి సభ్యులక్కొక్కరిని నాగ్ పేరు పెట్టి తాట తీసినంత పనిచేశాడు. ఎప్పుడూ పాటలు, డ్యాన్స్‌తో ఇంట్లోకి అడుగుపెట్టే నాగ్ వాటన్నింటిని క్యాన్సిల్ చేసి మరీ ఇంటి సభ్యుల దుమ్ము దులిపేశాడు.  కంటెస్టంట్స్ అందరికి షాక్ ఇస్తూ షూ తీసి పాలిష్ చేశాడు నాగ్. తమ పని తాము చేసుకోవడం వల్ల ఎలాంటి తప్పు ఉండదని. పనులు చిన్నవైనా వాటిని చేసే పద్ధతిలో చేస్తే స్థాయి తగ్గదని అన్నాడు నాగార్జున. ఇదంతా పునర్నవి, మహేష్ లు షూ పాలిష్ టాస్క్ లో చేసిన అతికి నాగార్జున పంచ్ ఇచ్చాడు. నాగార్జున షూ పాలిష్ చేస్తుంటే హౌజ్ మెట్స్ అంతా క్లాప్స్ కొట్టారు. బిగ్‌బాస్‌పై తిరుగబాటు చేసిన పునర్నవి, మహేష్‌లకు నాగార్జున గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. పునర్నవి బుల్‌షిట్‌ టాస్క్ అంటావా? అలాంటి మాటలేనా మాట్లాడేదంటూ పునర్నవిని మందలించాడు.

గేట్లు తెరిపించి మరీ గేట్లు తెరిచే ఉన్నాయి వెళ్తావా? అంటూ మహేష్‌పై సీరియస్‌ అయ్యాడు. అయితే మహేష్‌ విషయంలో రాహుల్‌, పునర్నవిని వరుణ్‌ ఒప్పించిన విధానం బాగుందని వారిని మెచ్చుకున్నారు. మిగతా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నందుకు శ్రీముఖిపై ఫైర్‌ అయ్యాడు. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు నీ ఆట నువ్వు ఆడుకో శ్రీముఖి నువ్వు బిగ్ బాస్ వి కావు హౌజ్ మెట్స్ ను మ్యానిపులేట్ చెయొద్దని వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. రూల్స్‌ సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆడావని, అందుకే పునర్నవికి కోపం వచ్చిందని.. రూల్స్‌ను ఫాలో అవుతూ గేమ్‌ ఆడాలని శిల్పాకు సూచించాడు. ఇక ప్రపంచ విజేత పీవీ సింధు బిగ్‌బాస్‌ షోలో సందడి చేసింది. కోచ్‌ గోపీచంద్‌తో కలిసి షోకు విచ్చేసిన సింధు హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు. అందరూ బాగా ఆడుతున్నారని ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. హౌస్‌మేట్స్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన సింధు అక్కడనుంచి వెళ్లిపోయారు. ఇక హిమజ, మహేష్, శ్రీముఖి, శిల్పా చక్రవర్తి, పునర్నవిలలో శనివారం ఎపిసోడ్ లో హిమజని సేఫ్ జోన్ లో పెట్టారు నాగార్జున. ఈ వారం ఎలిమినేషన్ ఎవరన్నది ఈరోజు తెలుస్తుంది.

More Related Stories