నేష‌న‌ల్ లెవ‌ల్ వెబ్ సిరీస్ ల‌తో రాబోతున్న నాగ్Nagarjuna
2021-04-26 22:08:02

కింగ్ నాగార్జున ఎప్పుడూ కొత్త రకం పాత్రలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ఇప్పటివరకు నాగార్జున మాస్ క్లాస్ మాత్రమే కాకుండా డెవొషనల్ సినిమాల్లో నటించి అలరించారు. ఇక నాగార్జున ఇటీవల విడుదలైన వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో రా ఏజెంట్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున అదరగొట్టాడు. ఇక ఎప్రిల్ 2 న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అంతే కాకుండా కరోనా ఎఫెక్ట్ తో సినిమా కలెక్షన్ లపై భారీ దెబ్బ పడింది. కానీ ఓటీటీ లో విడుదలైన వైల్డ్ డాగ్ సినిమా దూసుకుపోతుంది. దాదాపు ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఈ నేపథ్యంలో నాగార్జున మరోసారి ఈ సినిమా కోసం ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అయితే కరోనా విజృంభన నేపథ్యంలో నాగ్ జూమ్ వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కరోనా ఎఫెక్ట్ వైల్డ్ డాగ్ పై పడిందని అన్నారు. కానీ ఓటీటీ లో వైల్డ్ డాగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. అంతే కాకుండా రెండు నేషనల్ లెవల్ వెబ్ సిరీస్ లలో నటించేందుకు అవకాశం వచ్చిందని దాదాపు ఆ ప్రాజెక్ట్స్ ఒకే అవుతాయని చెప్పారు. దాంతో నాగ్ త్వరలో ఓటీటీలోనూ సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.

More Related Stories