కొత్త బిజినెస్ లోకి నాగార్జున Nagarjuna
2021-04-30 16:11:39

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు హోస్ట్ గా బుల్లితెర పై సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగానే నాగార్జున నిర్మాణ రంగంలోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ కొత్తవాళ్లకు సైతం అవకాశాలు ఇస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగ్ మరో బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. ప్రస్తుతం ఓటీటీ ల జోరు నడుస్తున్న సంగతి తెలిసిందే.

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ తో పాటు ఇప్పుడు ఆహా కూడా ఫామ్ లోకి వచ్చింది. అయితే నాగ్ కూడా సొంతంగా ఓ ఓటీటీ ని ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఇప్పటికే నాగ్ 12 చిన్న సినిమాలని నిర్మించదానికి రెడీ అయ్యారు. అయితే ముందుగా ఈ సినిమాలను ఓటీటికి అమ్మాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు తానే సొంతంగా ఓటీటీని ప్రారంభించి అందులోనే సినిమాలను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. అంతే కాకుండా ప్రస్తుతం దీని గురించి స్నేహితులతో సంప్రధింపులు కూడా జరుపుతున్నారట. ఇక ఇప్పటికే నిర్మాత అల్లు అరవింద్ "ఆహా" ను ప్రారంబించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే దారిలో వెళ్లి నాగ్ సక్సెస్ అవుతారా లేదా చూడాలి.

More Related Stories