మెగా మేనల్లుడితో నాగార్జున సినిమా



Nagarjuna
2021-02-17 16:17:32

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఫిబ్రవరి 12న విడుదలైన వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా 35కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. ఓ డెబ్యూ హీరో సినిమా ఈ రేంజ్ లో షేర్ రాబట్టడం రికార్డులు తిరగరాయడమే. ఈ సినిమా విడుదలకు ముందే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. సినిమాలోని పాటలు బాగుండటం ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరిగింది. అంతే కాకుండా ఈ సినిమా క్లయిమాక్స్ కొత్తగా ఉండబోతుందని జోరుగా ప్రచారం జరగడంతో సినిమాకు  మరింత హైప్ క్రియేట్ అయ్యింది. 

ఇక ఇప్పటికే వైష్ణవ్ తేజ తన రెండో సినిమాను కూడా పూర్తి చేశాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఇక వైష్ణవ్ తేజ్ మూడో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించబోతునట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా జులై నుండి సెట్స్ పైకి వెళ్లనుందని కూడా టాక్. అంతే కాకుండా ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారట.

More Related Stories