ఓటిటిలో నాగార్జున వైల్డ్ డాగ్...రిలీజ్ డేట్ ఇదే



Nagarjuna
2021-01-02 13:12:42

మన్మథుడు నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిషున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూరయ్యింది. అహిషోర్  సాల్మోన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. సినిమాను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో నాగ్ సరసన అందాల భామ దియా మీర్జా, సయామి ఖేర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అవ్వాల్సింది కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమయింది. 

ఇదిలా ఉండగా ఈ సినిమాను థియేటర్ లో కాకుండా నేరుగా ఓటిటి లో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సినిమా ను రిలీజ్ చేయడానికి ఓ డేట్ ను కూడా ఫిక్స్ చేసింది. జనవరి 26న రిపబ్లిక్ డే సంధర్భంగా సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే థియేటర్లలో సాయి ధరమ్ తేజ్ నటించిన "సోలో బతుకే సో బెటర్" సినిమా  క్రిస్మస్ కానుకగా విడుదల అయింది. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా థియేటర్ లకు కూడా పబ్లిక్ వస్తున్నారు. దాంతో సంక్రాంతి బరిలో చాలా సినిమాలే ఉన్నాయి. కానీ "వైల్డ్ డాగ్" యూనిట్ మాత్రం ఓటిటి ని నమ్ముకోవడం ఆశ్చర్యకరం. ఇక ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. 

More Related Stories