హ్యాపీ బ‌ర్త్ డే మోక్ష‌జ్ఞ‌.. వార‌సుడి ఎంట్రీ ఎప్పుడో..?mok
2019-09-06 18:55:01

ఇప్ప‌ట్లో వార‌సులు ఎవ‌రూ ఇండ‌స్ట్రీకి రాకపోవ‌చ్చు.. ఒక్క నంద‌మూరి మోక్ష‌జ్ఞ త‌ప్ప‌. ఈయ‌న ఎంట్రీ కోసం నంద‌మూరి అభిమానులు కొన్నేళ్లుగా వేచి చూస్తున్నారు. జూనియ‌ర్ బాల‌య్య వ‌స్తాడు.. వ‌చ్చీ రాగానే బాక్సాఫీస్ తాట తీస్తాడు అనే ఊహ‌ల్లో ఉన్నారు అభిమానులు. పైగా నంద‌మూరి ఫ్యామిలీ అంటేనే మాస్.. వాళ్ల‌కు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ మ‌రెవ‌రికీ ఉండ‌దు. ఒక్క సినిమా హిట్టైతే చాలు ఆటోమేటిక్ గా స్టార్స్ అయిపోతారు. సింహాద్రి ఎఫెక్ట్ తో ఇప్ప‌టికీ సూప‌ర్ స్టార్ గానే ఉన్నాడు ఎన్టీఆర్. ఇక బాల‌య్య సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్పుడో ఓ సారి హిట్ కొట్టినా..అది సాలిడ్ గా ఉంటుంది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మ‌రో వార‌సుడు వ‌స్తున్నాడు. అత‌డే మోక్ష‌జ్ఞ‌. 13 ఏళ్ల కింద నంద‌మూరి ఫ్యామిలీ నుంచి వ‌స్తోన్న వార‌సుడు మోక్షు. క‌ళ్యాణ్ రామ్ త‌ర్వాత మ‌ళ్లీ కొత్త హీరో ఎవ‌రూ రాలేదు. అఖిల్ 20 ఏళ్ల‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు. చ‌ర‌ణ్ కూడా అప్ప‌ట్లో 22 ఏళ్ల‌కే హీరో అయ్యాడు.. బ‌న్నీ అయితే మ‌రీ 18 ఏళ్ల‌కే వ‌చ్చేసాడు.. నాగ‌చైత‌న్య 22 కు వ‌చ్చాడు. ఇప్పుడు మోక్ష‌జ్ఞ కూడా 20 ల్లోకి వ‌చ్చేసాడు. దాంతో త‌న‌యుడిని హీరో చేస్తున్నాడు బాల‌య్య‌. కానీ అదెప్పుడు అనేది మాత్రం తెలియదు. రెండేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నా కూడా ఎక్కడా అయితే క్లారిటీ రావడం లేదు. సాయి కొర్ర‌పాటి మాత్రం మోక్షు కోసం ఇప్ప‌టికే రానే వ‌చ్చాడు రామ‌య్యా అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. తొలి సినిమా మాస్ ను మెప్పించేలా ఉంటుందా.. లేదంటే ల‌వ్ స్టోరీ చేస్తాడా అనే విష‌యంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కొందరు అయితే ఏకంగా అసలు నందమూరి వారసుడికి నటన అంటే ఆసక్తి లేదు.. బిజినెస్ చేస్తాడనే ప్రచారం కూడా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఫిజిక్ మెయింట‌నెన్స్.. న‌ట‌న‌పై పెద్దగా ఫోకస్ చేసినట్లు అనిపించడం లేదు. ఎందుకంటే ఈ మధ్యే విడుదలైన ఫోటోల్లో మోక్షు చాలా లావుగా ఉన్నాడు. మొత్తానికి ఈ బర్త్ డేకు అయినా తీపికబురు చెప్తాడేమో అనుకుంటే ఇప్పుడు కూడా నిరాశనే మిగిల్చాడు నందమూరి వారసుడు.

More Related Stories