సమంత దర్శకురాలితో నాగ చైతన్య సినిమా...Naga Chaitanya
2020-03-04 21:03:56

నాగ చైతన్య ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మీడియం రేంజ్ హీరోలలో ఈయన ఉన్నంత బిజీగా ఎవరూ లేరు. వరస సినిమాలతో దుమ్ము దులిపేస్తున్నాడు ఈయన. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ముందు ఎప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మూడు నెలలు ఆలస్యంగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శేఖర్  కమ్ముల. 

ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే పరుశురామ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు ఈయన. దీనికంటే ముందు 14 రీల్స్ నిర్మాణంలో నాగేశ్వరరావు అనే టైటిల్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నా కూడా ఇప్పుడు పరుశురాం కోసం ఈ సినిమాను పక్కనబెట్టేసాడు. మరోవైపు మహేష్ ఛాన్స్ ఇవ్వడంతో.. చైతు సినిమాను అక్టోబర్ లోపు పూర్తి చేయాలని చూస్తున్నాడు పరుశురామ్. 

ఇక ఇన్ని సినిమాలు ఉండగానే ఇప్పుడు లేడి డైరెక్టర్ నందిని రెడ్డితో చైతూ సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది ఈమె సమంతతో తెరకెక్కించిన ఓ బేబీ మంచి విజయమే సాధించింది. ఈ సినిమా తర్వాత కొందరు హీరోలకు కథలు చెప్పినా కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు చైతూతో సినిమా ఓకే అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈమె సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ కు కథ చెప్పిందని తెలుస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు వర్కవుట్ అవుతుందో చూడాలిక.

More Related Stories