టక్ జగదీష్ అంటున్న నాచురల్ స్టార్ నాని..Tuck Jagadish
2019-12-03 20:51:56

వరుస సినిమాలతో రఫ్ ఆడిస్తున్నాడు నాచురల్ స్టార్ నాని. ఒక సినిమా పూర్తి కాకముందే మరో రెండు మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఈయన. ఈ ఏడాది ఇప్పటికే జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో వచ్చాడు నాని. ఇందులో జెర్సీ మంచి విజయం తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. గ్యాంగ్ లీడర్ మాత్రం డిజాస్టర్ అయిపోయింది. 

ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న వి సినిమాతో బిజీగా ఉన్నాడు నాని. ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నాడు ఈయన. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. నివేదా థామస్ హీరోయిన్. నానికి ఇది 25వ సినిమా సినిమా కావడం విశేషం. తనను హీరోగా చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోని 25వ సినిమా కూడా చేస్తున్నాడు నాచురల్ స్టార్. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తన 26వ సినిమాపై దృష్టి పెట్టాడు నాని. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. రెండేళ్ల కింద నిన్ను కోరి అంటూ ఈ కాంబినేషన్ మాయ చేసింది. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్లో టక్ జగదీష్ సినిమా వస్తుంది. 

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. నిన్నుకోరి, మజిలీ లాంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు శివ నిర్వాణ. దాంతో ఇప్పుడు నాని సినిమా హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గురపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020లో టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ తొలిసారి మాస్ స్టోరీ ప్రయత్నిస్తున్నాడు.

More Related Stories