తెలుగు ఇండస్ట్రీలో మరో క్రేజీ మల్టీస్టారర్.. ఆ హీరోతో నాని సినిమా..Nani And Rana
2020-09-22 23:49:21

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. మన హీరోలు కూడా చాలా మారిపోయారు. ఒకప్పుడు ఇమేజ్ చట్రంలో పడి మల్టీస్టారర్ కథలకు నో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. పరిస్థితులకు తగ్గట్టు మన హీరోలు కూడా మారిపోతున్నారు. అందుకే మల్టీస్టారర్ సినిమాలు తెలుగులో కూడా చాలా వస్తున్నాయి. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలని కలిపి సినిమా చేస్తున్నప్పుడే మిగిలిన హీరోలందరూ ఈగోలు తీసి పక్కన పెట్టేశారు. ఇప్పటికే చాలా సినిమాలు అలాంటివి వస్తున్నాయి. ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ కూడా రాబోతుంది. నాచురల్ స్టార్ నాని, దగ్గుబాటి వారసుడుతో కలిసి నటించబోతున్నాడు. త్వరలోనే నాని, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. దీని కోసం ఓ దర్శకుడు కథ సిద్ధం చేస్తున్నాడు. 

ఈ సినిమాను నిర్మాత సురేష్ బాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఇద్దరి ఇమేజ్ కు సరిపోయే ఒక కథ దగ్గరుండి మరీ సిద్ధం చేయిస్తున్నాడు సురేష్ బాబు. నానితో సినిమా చేయాలని కూడా రానాకు కూడా ఎంతో ఇష్టం. ఎందుకంటే ఇద్దరు మంచి స్నేహితులు. చాలా కాలంగా ఇద్దరూ కలిసి నటించాలని అనుకుంటున్నారు కూడా. అయితే సరైన కథ ఇన్ని రోజులు దొరకలేదు. ఇప్పుడు సరైన కథ దొరకడంతో వెంటనే పూర్తి కథ సిద్ధం చేయాలని సురేష్ బాబు సూచించాడు. ప్రస్తుతం నాని శ్యామ సింగ రాయ్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. రానా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇద్దరూ ఫ్రీ అయిన తర్వాత మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లనుంది. 

More Related Stories