రాజుగారిగ‌ది 2లో హీరో నాని..2017-04-01 13:58:52

అదేంటి.. రాజుగారిగ‌ది 2లో హీరో నాని ఏంటి..? అందులో హీరో నాగార్జున క‌దా అనుకుంటున్నారా..? ఇది నిజ‌మే.. కానీ అందులో హీరో నాని అనేది కూడా నిజ‌మేనండోయ్..! ఓహో నాని ఏదైనా గెస్ట్ రోల్ చేస్తున్నాడేమో అనుకుంటున్నారా.. అయితే అది కూడా కాదు. హీరో నానికి ఈ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదు. కానీ నానితో మాత్రం రాజుగారిగ‌ది 2కు సంబంధం ఉంది. ఏంటీ క‌న్ఫ్యూజ‌న్ అనుకుంటున్నారా..? ఏం లేదండీ నాగార్జున గారి ముద్దుపేరు నాని. అవును.. ఈ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికీ తెలియ‌దు. ఇంట్లో నాగార్జున‌ను నాని అని పిలుస్తార‌ని అక్కినేని కుటుంబానికి అత్యంత స‌న్నిహిత‌మైన ఓ వ్య‌క్తి చెప్పింది. నాగ్ ను ఇప్ప‌టికి కూడా త‌న‌కు కావాల్సిన వాళ్లు నాని అనే పిలుస్తార‌ట‌. మొత్తానికి ఇలా చూసుకుంటే రాజుగారిగ‌ది 2లో హీరో మ‌న ముద్దు నానినే కదండీ..!

More Related Stories