నాని శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ విడుదల



Shyam Singha Roy
2021-02-24 18:47:56

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ ఉన్నాడు. అయితే బర్త్ డే సంధర్బంగా తన సినిమాల నుండి ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నాడు. నిన్న నాని నటిస్తున్న "టక్ జగదీశ్" సినిమా నుండి టీజర్ ను విడుదల చేయగా..నేడు తాజాగా శ్యామ్ సింగరాయ్ నుండి పోస్టర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ పోస్టర్ ను నాని తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. పోస్ట్ కు "పేరు శ్యామ్..పూర్తి పేరు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ పోస్టర్ నాని అభిమానులను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

నాని పోస్టర్ లో జేబులో చేతులు పెట్టుకుని నిలబడగా...వెనక నుండి చేతులకు పారాని రాసుకున్న హీరోయిన్ హత్తుకుంది. దాంతో సినిమా టైటిల్ మాత్రమే కాకుండా ఇప్పుడు పోస్టర్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా..నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కలకత్తా బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ వేళ "వి" సినిమాతో వచ్చిన నాని ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు. దాంతో చాలా జాగ్రత్తగా సినిమాలు లైన్ లో పెడుతున్నారు. మరి ఈ సినిమాలు నానికి ఎలాంటి విజయం తెచ్చిపెడతాయో చూడాలి.

More Related Stories