నాని నిర్మాతగా అడవి శేషు సినిమాAdivi Sesh
2020-12-01 03:13:01

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన సినిమా "హిట్". క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించింది. అయితే హిట్ సీక్వెల్ లో మాత్రం హీరోగా విష్వక్ ను కాకుండా అడవి శేషు ని హీరోగా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

విష్వక్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడా..లేదంటే చిత్ర బృందమే కావాలని పక్కన పెట్టిందా అన్నదానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక హిట్ సీక్వెల్ కి కూడా నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్షన్ చేయబోతున్నారు. ఈ సినిమా ను మార్చ్ లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. పోలీస్ డ్రామాగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్నాడు.

More Related Stories