నానితో మరో సినిమా సెట్ చేసిన మారుతి !nani
2020-05-10 23:53:02

నాని- మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన కామెడీ ఎంట‌ర్‌టైనర్ భ‌లే భలే మ‌గాడివోయ్. 2014లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక నానికి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తారని గత ఏడాది నుండి అడపాదడపా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే వీరి కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వర‌లోనే ఈ కాంబో మీద అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని కూడా సమాచారం.

ప్రస్తుతం నాని తనకి లైఫ్ ఇచ్చిన మోహన కృష్ణ ఇంద్రగంటితో వీ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా అది కూడా కరోనా కారణంగా అది వాయిదా పడింది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా గత ఏడాది ప్రతి రోజూ పండగే అనే సినిమా చేసిన మారుతి ఆ తరువాత మరే సినిమా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మారుతి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ క్కన్ఫర్మేషన్ లేకోయినా ఈ సినిమా నాని కోసమే అని ప్రచారం జరుగుతోంది. గతంలో మతిమరుపు కాన్సెప్ట్ తో అలరించిన నని - మారుతీ ఈ సారి ఎటువంటి కాన్సెప్ట్ తో రానున్నారనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories