టాక్సీవాలా దర్శకుడితో నాని Nani
2020-01-24 16:12:08

ఒక్కో సారి దర్శకులు మంచి సినిమాలతో వచ్చినా వారికి ఎందుకో కానీ ఆ తర్వాత సినిమాలు ఉండవు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్, టాక్సీవాలా దర్శకుడు రాహుల్ లు కూడా మంచి సినిమాలు అందించినా వారికి తర్వాత సినిమలు లేకుండా పోయాయి. అయితే ఎట్టకేలకి పరశురామ్ కి సినిమా దొరకగా ఇప్పుడు రాహుల్ కి కూడా సినిమా ఓకే అయ్యిదని చెబుతున్నారు.  

రాహుల్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నానీ ఒక సినిమాకి కమిట్ అయ్యాడని సమాచారం. నానీ గత ఏడాది జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘వి’ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నాడు. అంతేకాక శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘టక్ జగధీష్’ అనే కామెడీ ఎంటర్ టైనర్ కూ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు రాహుల్ సినిమాకి కూడా ఆయన ఓకే చెప్పాడని అంటున్నారు. 

ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా లైన్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి అధికారిక సమాచారం త్వరలోనే వెలువడనుంది.

More Related Stories