చివ‌రి షెడ్యూల్లోకి ఎంట‌రైన ట‌క్ జ‌గ‌దీష్‌



Tuck Jagadish
2020-12-04 15:17:14

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ట‌క్ జ‌గ‌దీష్'. ఈ సినిమా షూటింగ్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో చివ‌రి షెడ్యూల్లోకి ప్ర‌వేశించింది. నాని న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని "షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్"‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం  హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన చివరి  షెడ్యూల్‌లో చిత్రంలోని ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో  రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ ఫిమేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ  సినిమాకు ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ లో నాని లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక "వి" సినిమా పరాజయం తరవాత నాని టక్ జగదీష్ తో హిట్ కొట్టాలని ఆసక్తిగా ఉన్నాడు. ఈ సినిమాతో నాని హిట్ కొడతాడో లేదో చూడాలి.  

More Related Stories