దేవరకొండ దర్శకుడితో నాని Nani
2019-12-12 19:49:55

నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరు మీదున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో వి సినిమా చేస్తున్న నాని.. అది పూర్తవగానే దర్శకుడు శివ నిర్వాణతో `టక్ జగదీష్` అనే  సినిమాను మొదలు పెడతారు.  తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ని ప్రచారం జరుగుతోంది. గ‌త ఏడాది యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `టాక్సీవాలా` లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన రాహుల్ ద‌ర్శక‌త్వంలో నాని ఓ సినిమా ఓకే చేసినట్టు చెబుతున్నారు. అందుకు సంబందించి నాని, రాహుల్ మ‌ధ్య ఈ మేర‌కు చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని… సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంద‌ని టాక్. నాని నటిస్తున్న రెండు సినిమాలు పూర్తైన తర్వాత రాహుల్‌ సినిమా మొదలు పెడతాడా ?, సెట్స్‌పై ఉండగానే ప్రారంభిస్తాడా? అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More Related Stories