నాని టక్ జగదీష్ నుండి అదిరిపోయే అప్డేట్



 Nanis Tuck Jagadish
2021-01-09 12:25:06

పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా ఫుల్ బిజీ అయిపోయారు. 2020 లో నాని " వి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లాక్ డౌన్ వేళ ఓటీటీ లో విడుదల అయిన ఈ సినిమా అభిమానులను నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమా "టక్ జగదీష్". ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నానికి సరసన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహుగారిపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సంగీత ప్రపంచంలో వెలుగు వెలుగుతున్న తమన్ సినిమాకు స్వరాలను సమకూరుస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ లో నాని డీసెంట్ గా కనిపిస్తూ వెనక కత్తి పెట్టుకుని అందరినీ ఆకర్షించాడు. ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ ను ప్రకటించింది చిత్ర యూనిట్. "టక్ జగదీష్" విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ పోస్టర్ లో నాని పెళ్లికి ముస్తాబవుతున్నట్టు కనిపిస్తోంది. ఇక తాజా అప్డేట్ తో నాని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక సమ్మర్ లో "టక్ జగదీష్" గా వస్తున్న నాని అంచనాలను రీచ్ అవుతారా లేదా చూడాలి.

More Related Stories