నారప్ప రిలీజ్ డేట్ వాయిదా



 Narappa Release
2021-04-29 14:03:25

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే దాదాపు అన్ని సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడింది. మరోవైపు నటీనటులు కూడా కరోనా బారిన పడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఇక కరోనా ఎఫెక్ట్ తో మళ్ళీ సినిమా థియేటర్ లు కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ ను వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించాయి. విడుదలకు సిద్దంగా ఉన్న లవ్ స్టొరీ, టక్ జగదీశ్, ఆచార్య సినిమాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి. 

ఇక తాజాగా ఆ లిస్ట్ లో "నారప్ప" కూడా చేరిపోయింది. ఈ సినిమా ను మే 14న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే తాజాగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. "నారప్ప చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు అందరికి మనవి..ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. పరిస్థితులు చక్కబడ్డాక సినిమాను విడుదల చేస్తాం. అందరూ మస్కులు ధరించండి..జాగ్రత్తగా ఉండండి" అంటూ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా విడుదలకు సిద్ధంగా ఉన్న మరికొన్ని సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా పదే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

More Related Stories